ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి – రంగంలోకి జీ-7 దేశాలు!

-

హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియాపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు ఇరాన్ కాచుకు కూర్చుంది. ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై యుద్ధమేఘాలు ఆవరించే అవకాశం ఉందని అమెరికా, జీ-7 దేశాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన ఈ దేశాలు ఇరాన్ను దీటుగా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తూ.. అమెరికా ఇప్పటికే అదనపు బలగాలను పంపింది. మరోవైపు జీ-7 దేశాలు కూడా ఇజ్రాయెల్కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పటికే అగ్రరాజ్యం ఐడీఎఫ్తో కలిసి వ్యూహాలు పన్నుతోంది.

దాడి జరిగే అవకాశం ఉన్నందున ఇజ్రాయెల్, అమెరికా దేశాల అగ్రశ్రేణి కమాండర్లు సోమవారం రోజున టెల్‌అవీవ్‌లో సమావేశమయ్యారు. తాజా పరిస్థితులపై జీ-7 దేశాల మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కూడా చర్చించారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌, హెజ్‌బొల్లా ఏ క్షణంలోనైనా దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు తమకు సమాచారం ఉందని, దాడులు కచ్చితంగా ఎప్పుడూ ఉండొచ్చనేది మాత్రం తెలియదని ఆంటోని బ్లింకెన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news