పాక్ లోని ఉగ్ర స్థావరాలపై ఇరాన్ దాడి.. తీవ్ర పరిణామాలుంటాయని దాయాది వార్నింగ్

-

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. దాయాది దేశంలోని బలూచీ మిలిటెంట్‌ గ్రూప్‌ జైష్ అల్‌ అదిల్‌కు చెందిన స్థావరాలపై ఇరాన్‌ సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో జైష్ అల్ అదిల్కు చెందిన రెండు ప్రధాన కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అయితే అంతకుముందు బలూచీ మిలిటెంట్లు సరిహద్దు వెంట ఉన్న తమ భద్రత బలగాలే లక్ష్యంగా దాడులు చేశారని ఆరోపిస్తూ.. దానికి ప్రతిచర్యగానే పాకిస్థాన్లోని జైష్ అల్ అదిల్ స్థావరాలపై దాడి చేశామని ఇరాన్ పేర్కొంది.

ఈ విషయంపై స్పందించేందుకు బలూచిస్థాన్‌ మంత్రి నిరాకరిస్తూ.. పాకిస్థాన్‌ కేంద్ర అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రిత్వశాఖ దీనిపై స్పందిస్తుందని తెలిపారు. మరోవైపు ఇరాన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పాకిస్థాన్ తెలిపింది. ఈ దాడులను ఖండిస్తూ తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఇరాన్ తమ గగనతలంలోకి వచ్చి చేసిన దాడుల్లో ఇద్దరు చిన్నారులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. మరో ముగ్గురు బాలికలు తీవ్రంగా గాయపడ్డారని పాక్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఇరుదేశాల మధ్య చర్చలకు చాలా అవకాశాలు ఉన్నప్పటికీ ఇరాన్ దాడులకు పూనుకుందని తీవ్రంగా ఫైర్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version