చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ సైన్యం గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. ఎలాగైనా హమాస్ మిలిటెంట్లను అంతం చేయాలన్న పట్టుదలతో ఉన్న ఇజ్రాయెల్ సైన్యం తాజాగా గాజాలోని 200 హమాస్ స్థావరాలపై విమానాలతో బాంబుల వర్షం కురిపిస్తోంది.
మరోవైపు దక్షిణ గాజా పట్టనమైన ఖాన్ యూనిస్ నుంచి వేలాది మంది ప్రజల్ని ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఉత్తర గాజా నుంచి వచ్చిన పాలస్తీనీయులు .వేరే ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇజ్రాయెల్ దాడులతో మరోసారి వేలాది మంది ప్రజలు ప్రాణాలు చేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దక్షిణ గాజాలోని 230 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 20 లక్షలకు పైగా బాధితులు ఆశ్రయం పొందుతుండగా.. భూతల దాడులను ఇజ్రాయెల్ మరింత విస్తరించడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది.
ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లో 15 వేలకు పైగా పాలస్తీనీయులు మరణించారని గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 42 వేల మంది గాయపడ్డారని వెల్లడించారు.