ఇజ్రాయెల్ భీకర దాడుల్లో 150 మంది గాజా పౌరుల మృతి

-

ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర పోరు రోజురోజుకు తీవ్రతమరమవుతోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రం చేయడంతో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైన్యంపై విరుచుకుపడుతున్నారు. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 150 మంది మరణించారు. మరో 313 మంది తీవ్రంగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడిలో పాలస్తీయనియన్ల మృతుల సంఖ్య 26,900కు చేరినందని తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నారని పేర్కొంది.

మరోవైపు ఇటీవల ఇజ్రాయెల్ బలగాలపై హమాస్ మిలిటెంట్లు భీకర దాడి చేయగా.. అందులో 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. యుద్ధం మొదలైన తర్వాత జరిగిన దాడుల్లో అత్యధిక మంది ఇజ్రాయెల్ సైనికులు చనిపోవడం ఇదే తొలిసారి అని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారీ తెలిపారు. ఇంకోవైపు హమాస్ దాడిలో.. పాలస్తీనా యుద్ధ బాధితుల అభివృద్ధి, సహాయం కోసం పనిచేస్తున్న ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. యుద్ధం అనంతరం గాజాలో ఆ ఏజెన్సీ కార్యకలాపాలను నిలిపేయాలని కోరతామని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version