ఇజ్రాయెల్​-హమాస్​ మారణకాండ.. ఘర్షణల్లో 1,580 మంది మృతి

-

పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం మారణహోమం సృష్టిస్తోంది. అత్యంత పాశవికంగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పౌరులపై దాడులకు తెగబడుతున్నారు. ఈ మారణకాండలో 900కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు హమాస్, పాలస్తీనాపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో 680 మంది మరణించారు. గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యంత దారుణమైన, విషాదమైన ఘటన అని ప్రపంచ దేశాలు పేర్కొంటున్నాయి.

మిలిటెంట్లకు, ఇజ్రాయెల్‌ సైన్యానికి మధ్య పట్టణాలు, నగరాల్లో ప్రారంభమైన పోరాటం ముగింపు దశకు చేరుకున్నట్లుగా సైన్యం ప్రకటించింది. మిలిటెంట్లకు కేంద్రంగా నిలిచిన గాజాను ఇజ్రాయెల్‌ అష్ట దిగ్బంధం చేసినట్లు తెలిపింది. విద్యుత్తు, ఆహారం, ఇంధనాన్ని నిలిపేసినట్లు వెల్లడించింది. గాజా సరిహద్దుల్లో ధ్వంసమైన కంచెల వద్ద భద్రతను ఇజ్రాయెల్ సైన్యం మళ్లీ కట్టుదిట్టం చేసింది.

మరోవైపు పాలస్తీనా నుంచి రాకెట్ల వర్షం కురుస్తూనే ఉండగా.. జెరూసలెం, టెల్‌ అవీవ్‌లలో సైరన్లు మోగుతూనే ఉన్నాయి. హమాస్‌ మిలిటెంట్లపై ప్రతి దాడులను తీవ్రం చేసినట్లు ఇజ్రాయెల్‌ పేర్కొంది. గాజా సరిహద్దు వెంబడి ఊహించిన దాని కంటే ఎక్కువ చోట్ల చొరబాట్లు జరిగాయని, వాటిని తిప్పికొట్టేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని ఆ దేశ సైనిక ప్రతినిధి రిచర్డ్‌ హెచ్‌ తెలిపారు. ఇజ్రాయెల్‌పై భవిష్యత్తులో దాడులు చేయడానికి హమాస్‌ వద్ద ఎలాంటి ఆయుధాలు లేకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తామని ప్రతిజ్ఞ పూనారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version