ఎన్నికల్లో ఉచితాలకు కళ్లెం కష్టం : సీఈసీ రాజీవ్ కుమార్

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగిన వేళ ఆ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. అయితే ఎన్నికల ప్రచారం వేళ నగదు, మద్యం, బంగారం, ఇతర ప్రలోభాలకు తాము అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. కానీ ఎన్నికల్లో గెలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత తాయిలాలు.. ప్రజాకర్షణకు తాలింపు లాంటివని, పోరులో నెగ్గేవారు వాటిని అమలు చేయడం, ఆ అలవాటును నిలువరించడం మాత్రం కష్టమని అన్నారు.

కొన్ని రాజకీయ పార్టీలు ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో మరో హామీ ఇస్తుంటాయి.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మొత్తం అయిదేళ్లపాటు పార్టీలు ఎందుకని జ్ఞాపకం పెట్టుకోవో తనకు అర్థం కాదని సీఈసీ రాజీవ్ అన్నారు. షెడ్యూలు విడుదలకు 15 రోజులో, నెలరోజులో ముందుగా మాత్రం వాటిని ప్రకటిస్తుంటాయని .. ఏదైనా.. అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశమని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను ఏ విధంగా, ఎప్పట్లోగా నెరవేరుస్తారో వివరించాల్సిందిగా పార్టీల కోసం ఒక నిర్ణీత నమూనాను ఈ మధ్యే అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. ఏం చేయబోయేది చెప్పే స్వేచ్ఛ పార్టీలకు, దానిని ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version