రోజుకొక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో వినూత్న చట్టం!

-

ఏ దేశంలోనైనా నేరాన్ని అదుపులోకి తీసుకురావడానికో, ప్రజల సంక్షేమానికో ప్రభుత్వాలు చట్టాలు రూపొందిస్తాయి. జపాన్‌లో మాత్రం అక్కడి సర్కార్ ఓ వినూత్న చట్టం రూపొందించింది. ప్రతిరోజూ అందరూ నవ్వాలని చట్టం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యమగట ప్రిఫెక్చర్‌ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించటంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఈరోజు ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించిన సర్కార్.. ప్రతినెలా ఎనిమిదో తేదీని ప్రత్యేకంగా ‘హాస్యంతో ఆరోగ్యం’ కోసం కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్‌ మెడిసిన్‌’ చేసిన పరిశోధనల ఫలితమే తాజా చట్టం. మెరుగైన ఆరోగ్యం, జీవనకాల పెంపుపై అక్కడి పరిశోధకులు అధ్యయనం చేసి తక్కువగా నవ్వే వాళ్లలో కొన్నిరకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం కాస్త వెరైటీగా అనిపించినా ప్రపంచ దేశాలు ఈ చట్టాన్ని ప్రశంసిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version