పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్..ఒకేసారి 10 మందికి పైగా రాజీనామా !

-

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షా క్ తగిలింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జడ్పిటిసి మురళిదర్ వైసీపీ పార్టీకి, జడ్పిటిసి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని బాటలో పులిచెర్ల వైస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్ లు రాజీనామా చేశారు. వీరితో పాటు నలుగురు ఎంపీటీసీ సభ్యులు మరో ఏడు మంది సర్పంచులు రాజీనామా చేశారు.

Another shock to Peddireddy Ramachandra Reddy

రాజీనామా సమర్పించడానికి జిల్లా పరిషత్ కి చేరుకున్నారు జడ్పిటిసి మురళీధరన్. అయితే… జెడ్పి సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ కు రాజీనామాలు సమర్పించేందుకు వెళ్లారు నాయకులు. పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు నాయకులు. పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తమను ఆదుకోవడం లేదనే కారణంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు వైసీపీ పార్టీ నాయకులు. ఇక దీనిపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version