కిందపడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. వీడియో వైరల్‌

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి కిందపడిపోయారు. కొలరాడోలో అమెరికా వైమానిక దళ అకాడమీలో గురువారం గ్రాడ్యుయేషన్‌ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న బైడెన్‌ ఒక్కసారిగా కాలు స్లిప్‌ అయ్యి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయణ్ను పైకి లేపారు. అయితే పైకి లేపే క్రమంలో కూడా బైడెన్ పలుమార్లు కిందపడ్డారు.

అక్కడున్న అధికారుల సాయంతో బైడెన్‌ తన సీటు వద్దకు వెళ్లి కూర్చున్నారు. ఈ ఘటనలో అధ్యక్షుడికి ఎలాంటి గాయాలూ కాలేదని వైట్‌హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. బైడెన్‌ కిందపడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే బైడెన్ అనారోగ్య కారణాల వల్లే పడిపోయారని కొంతమంది అంటుంటే.. సమ్మర్​లో డీ హైడ్రేషన్ కామన్.. అందువల్లే పడిపోయి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఇక కొందరు నెటిజన్లయితే వయసు అయిపోతుంది కదా.. ఇలా పడిపోవడం కామన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బైడెన్‌ గతంలోనూ చాలాసార్లు ఇలా కిందపడిపోయారు. ఇటీవల విదేశీ పర్యటకు వెళ్లిన బైడెన్‌ తిరుగు ప్రయాణంలో ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ ఎక్కుతూ మెట్లపై జారిపడ్డ విషయం తెలిసిందే. ఇదే కాదు, చాలా సందర్భాల్లో అధ్యక్షుడు కింద పడి వార్తల్లో నిలిచారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version