ఇలాంటి ఘోరం చూస్తానని కల్లోకూడా అనుకోలేదు.. హమాస్ మారణకాండపై బైడెన్ ఆవేదన

-

ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడులు మరింత తీవ్రతరం అవనున్నాయన్న సంకేతాలతో ఐరాస కూడా ఆందోళన చెందుతోంది. ఇరు దేశాలు సమన్వయం పాటించి శాంతిభద్రలు పటిష్ఠంగా ఉండేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నాయి. అయితే తాజాగా ఇజ్రాయెల్​పై హమాస్ దాడులను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ఇలాంటి ఘోరాన్ని చూస్తానని అనుకోలేదని వ్యాఖ్యానించారు.

ఇజ్రాయెల్​పై దాడులు చేస్తున్న హమాస్ ముష్కరులు చిన్న పిల్లల తలలను తెగ్గోస్తున్నారని.. ఇలాంటి చిత్రాలను చూస్తానని జీవితంలో ఎన్నడూ ఊహించలేదని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చరిత్రలోనే అత్యంత పాశవికమైన దాడి అని పేర్కొన్నారు. తన లైఫ్​లో అత్యంత ఘోరాన్ని చూడాల్సి వస్తోందని వాపోయారు.

మరోవైపు.. హమాస్‌ ఘోరాలకు సంబంధించిన చిత్రాలను బైడైన్ స్వయంగా చూడలేదని వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్‌లో వారు సృష్టిస్తున్న విధ్వంసానికి సంబంధించి అందిన నివేదికల ఆధారంగానే స్పందించారని తెలిపింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన దాడిలో పలువురు అమెరికా పౌరులు మరణించినట్లు ధ్రువీకరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version