ఇరాన్ దాడుల వేళ రంగంలోకి అమెరికా.. ఇజ్రాయెల్‌కు కవచంలా ఉంటామన్న బైడెన్

-

ఇరాన్‌ – ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్ ఇజ్రాయెల్ పై డ్రోన్లతో దాడికి తెగబడింది. ఈ నేపథ్యంలో ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికా స్పందించింది. రంగంలోకి దిగిన ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు రక్షణగా ఉంటామని ప్రకటించారు.

భీకర దాడులను ఎదుర్కొని శత్రువును ఓడించడంలో ఇజ్రాయెల్‌ అద్భుతమైన సామర్థ్యాన్ని చూపించిందని తాను నెతన్యాహుకు తెలిపాను. తాము ఇజ్రాయెల్‌కు ఉక్కుకవచంలా ఉండటానికి కట్టుబడి ఉన్నామని, ఇరాన్‌ ప్రయోగించిన అన్ని డ్రోన్లు, క్షిపణులను కూల్చివేయడానికి సాయం చేశామని తెలిపారు. తమ సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారన్న బైడెన్.. భవిష్యత్తులో కూడా దీనిని కొనసాగిస్తామంటూ ఇరాన్ దాడులను ఖండించారు.

ఇరాన్‌ దాదాపు 300 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాటిల్లో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని .. ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఐడీఎఫ్‌ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా.. ఒక వ్యక్తి గాయపడ్డట్లు తెలిపింది. ఇరాన్‌ తన భూభాగంపై నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడం ఇదే తొలిసారి.

Read more RELATED
Recommended to you

Exit mobile version