BREAKING : యూకే ఎన్నికల్లో లేబర్‌ పార్టీ విజయం.. రిషి సునాక్ ఓటమి

-

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. 14 ఏళ్ల తర్వాత ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి మెజారిటీ స్థానాలు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. మరోవైపు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ క్రమంలో రిషి సునాక్‌ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు. లేబర్‌ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు కన్జర్వేటివ్‌ పార్టీ ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని రిషి సునాక్‌ అన్నారు. ఇవాళే అధికార మార్పిడి జరుగుతుందని వెల్లడించారు. శాంతియుత పద్ధతిలో అధికార మార్పిడి జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ విజయానికి నేతలు అవిశ్రాంతంగా కృషి చేశారని.. ఓటమికి తానే బాధ్యత వహిస్తానని పేర్కొన్నారు.

అంతకుముందు లేబర్ పార్టీ ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘మార్పు చెందిన లేబర్‌ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు’’ అని కీర్‌ స్టార్మర్‌ రాసుకొచ్చారు. మరోవైపు విజయం ఖాయమైన తర్వాత ఆయన స్పందిస్తూ.. మీరు ఓటేశారు.. ఇక మీకు సేవ చేయడం మా పని అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version