లీగల్ చిక్కుల్లో ట్విటర్ కొత్త లోగో X

-

ట్విటర్​ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ సంస్థతో ఎలాన్ మస్క్ ఫుట్ బాల్ ఆడుకుంటున్నారు. తరచూ ఏదో ఒక మార్పు తీసుకువస్తూ.. అటు ఉద్యోగులను.. ఇటు యూజర్లను తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ఆ తర్వాత బ్లూటిక్ అంటూ.. కొత్త ఛార్జీలు అంటూ రకరకాల మార్పులు తెచ్చారు. అనంతరం లోగో మార్చారు. ఇక తాజాగా ట్విటర్‌ త్వరలో ఓ సూపర్‌ యాప్‌గా రూపాంతరం చెందబోతోందని చెప్తూ..  ఎలాన్‌ మస్క్‌ దాని పేరును ‘ఎక్స్‌.కామ్‌’గా మార్చారు. ఈ మార్పు విషయంలో ఆయనకు చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి.

ట్విటర్ కేంద్ర కార్యాలయంపై ఏర్పాటు చేసిన లోగో గురించి శాన్‌ఫ్రాన్సిస్కో యంత్రాంగం విచారణకు ఆదేశించింది. ఒక సంస్థ లోగో, గుర్తును మార్చాలనుకున్నప్పుడు ముందుగా అనుమతి తీసుకోవాలని భవనాల తనిఖీల విభాగం అధికారి తెలిపారు. డిజైన, భద్రతా కారణాల దృష్ట్యా ఈ అనుమతులు అవసరమని చెప్పారు. మరోవైపు సోషల్‌ మీడియా సంస్థ నెలవారీ యాక్టివ్‌ యూజర్లు భారీగా పెరిగినట్లు మస్క్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version