విమానంలో 4000 కిలోమీట‌ర్లు ఒంట‌రిగా ప్ర‌యాణించిన వ్య‌క్తి

-

పెద్ద పెద్ద బోయింగ్ విమానాల్లో సాధార‌ణంగా 160 మంది వ‌ర‌కు ప్ర‌యాణిస్తారు. అయితే ఆ విమానంలో మాత్రం ఒకే ఒక వ్య‌క్తి ఏకంగా 4000 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాడు. అవును నిజ‌మే. ఈ సంఘ‌ట‌న ఇజ్రాయెల్‌లో చోటు చేసుకుంది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

ఇజ్రాయెల్‌కు చెందిన నేష‌న‌ల్ ఎయిర్‌లైన్ ఈఐ ఏఐ బోయింగ్ 737 విమానం ఇటీవ‌లే అక్క‌డి టెల్ అవివ్ బెన్ గురియాన్ ఎయిర్‌పోర్టు నుంచి మ‌ధ్యాహ్నం 2.20 గంట‌లకు బ‌య‌ల్దేరి వెళ్లింది. సాయంత్రం 5.22 గంట‌ల‌కు ఆ విమానం కాసాబ్లాంకా చేరుకుంది. అందులో ఒకే వ్య‌క్తి ప్ర‌యాణించాడు. త‌రువాత ఆ విమానం అక్క‌డ రాత్రి 7.10 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి తిరిగి మ‌రుస‌టి రోజు తెల్ల‌వారుజామున 3 గంట‌ల వ‌ర‌కు టెల్ అవివ్ చేరుకుంది.

అయితే అంత పెద్ద విమానంలో ఒకే ఒక వ్య‌క్తి ప్ర‌యాణించాడు. మొత్తం 4000 కిలోమీట‌ర్ల దూరం అత‌ను విమానంలో ఒంటరిగా ప్ర‌యాణించాడు. అత‌ను ఓ వ్యాపార‌వేత్త‌. త‌న చికిత్స కోసం అత‌ను ఏకంగా ఓ విమానాన్నే బుక్ చేసుకున్నాడు. అందుక‌నే అందులో ఒంట‌రిగా ప్ర‌యాణించాడు. రాను, పోను ఖ‌ర్చుల‌న్నీ అత‌ను చెల్లించాడు.

మొద‌ట ప్ర‌యాణం 6 గంట‌లు ప‌డితే తిరుగు ప్ర‌యాణం 5 గంట‌లే ప‌ట్టింది. అయితే అత‌ను ఒక్కడే అలా విమానంలో ప్ర‌యాణించ‌డం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. అస‌లు విష‌యం తెలిసి.. అంతేనా అని నెటిజ‌న్లు ఫీల‌య్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version