అమెరికా-చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు ఉప్పు-నిప్పులా తయారయ్యాయి. ముఖ్యంగా చైనా అమెరికాను లక్ష్యంగా చేసుకుని పలు రకాల దాడులకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ మద్దతు ఉన్న చైనా హ్యాకర్లు అమెరికా కీలక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నారని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. భవిష్యత్తులో సంక్షోభ సమయాల్లో దీన్ని అస్త్రంగా వాడుకొని అమెరికా, ఆసియా మధ్య కీలక కమ్యూనికేషన్‌లకు అంతరాయం కలిగించే అవకాశం ఉందని తెలిపింది.
గువామ్‌లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరానికి చెందిన వెబ్‌సైట్ సహా పలు కీలక సైట్లు చైనా హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఉన్నాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఈ హ్యాకర్లను టెక్ దిగ్గజం ‘వోల్ట్ టైఫూన్’గా పేర్కొంది. వీరు 2021 మధ్య నుంచి యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించింది. కమ్యూనికేషన్స్, తయారీ, యుటిలిటీ, రవాణా, నిర్మాణం, మేరీటైమ్, విద్య, ఐటీ రంగాల్లోని సంస్థలపై హ్యాకర్లు దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది.
బహుశా హ్యాకింగ్‌కు సంబంధించి కీలక అప్‌డేట్‌ను కనుగొని ఉంటారని గూగుల్‌లో సైబర్ సెక్యూరిటీ నిపుణుడొకరు తెలిపారు. చైనా నుంచి చాలా అరుదుగా ఇలాంటి కార్యకలాపాలు ఉంటాయన్నారు.