మాస్కో ఉగ్రదాడి.. నేరం అంగీకరించిన నిందితులు

-

రష్యా రాజధాని మాస్కోలోని ఓ మ్యూజిక్ కన్సర్ట్పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. విచక్షణారహితంగా కాల్పులు జరపడమే కాకుండా బాంబులు వేసి మరి సామాన్యుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో దాదాపు 130కిపైగా మంది మరణించారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితులను రష్యా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనకు పాల్పడిన ముష్కరులు రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు.

కాల్పులు, బాంబు పేలుళ్ల తర్వాత పరారయ్యే ప్రయత్నంలో శుక్రవారం పట్టుబడిన నలుగురిని సోమవారం మాస్కోలోని బాస్మనీ జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. నలుగురు తీవ్ర గాయాలతో కనిపించారు. ఇందులో ముగ్గురు నేరాన్ని అంగీకరించగా నాలుగో వ్యక్తి మాట్లాడే స్థితిలో కనిపించలేదు. విచారణలో అధికారులు వారిని తీవ్రంగా హింసించారని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నారు. పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేయగా.. వారిలో ఈ నలుగురు (దలెర్ద్‌జొన్‌ మిర్జొయెవ్‌, సైదక్రామి రచబలిజొద, షంసిదున్‌ ఫరీదుని, ముఖమ్మద్‌సొబిర్‌ ఫైజొవ్‌) ఉన్నారు. వీరు అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసాన్‌ ఉగ్రముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version