రష్యా లూనా-25 కూలిన చోట భారీ గొయ్యి.. ఫొటోలు విడుదల చేసిన నాసా

-

చంద్రుడిపై పరిశోధనల కోసం దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత రష్యా ప్రయోగించిన లూనా-25 సాంకేతిక కారణాలతో కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లూనా 25కు సంబంధించి ఓ కీలక విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా వెల్లడించింది. లూనా-25 కూలిన ప్రదేశాన్ని నాసా గుర్తించింది. ఆ వ్యోమనౌక ఢీ కొట్టడం వల్ల జాబిల్లిపై 10 మీటర్ల వెడల్పున్న ఒక భారీ గొయ్యి ఏర్పడిందని నాసా తెలిపింది.

చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న నాసా ఉపగ్రహం లూనార్‌ రికానసెన్స్‌ (ఎల్‌ఆర్‌వో) తీసిన ఫొటోల్లో ఇది కనిపించింది. వాటిని ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. లూనా-25 ల్యాండింగ్‌కు ఉద్దేశించిన ప్రదేశానికి అది 400 కిలోమీటర్ల దూరంలో ఉందని.. గత ఏడాది ఈ ప్రాంతాన్ని చిత్రీకరించినప్పుడు ఈ గొయ్యి కనిపించలేదని నాసా పేర్కొంది. లూనా-25ని గత నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఆగస్టు 21న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగే యత్నంలో .. కొన్ని కిలోమీటర్ల ఎత్తులోనే విఫలమై కూలిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version