తప్పతాగి కారు నడిపిన మంత్రి.. ఆపై పదవికి రాజీనామా

-

దేశానికి ఆమె న్యాయశాఖ మంత్రి. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఆమె మద్యం సేవించి డ్రైవింగ్ చేశారు. ఓ ప్రమాదానికి కారణమయ్యారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బ్రీతింగ్ పరీక్ష నిర్వహించగా.. ఆమె మందు తాగి డ్రైవింగ్ చేసినట్లు తేలింది. ఈ క్రమంలో అరెస్టు చేయబోగా.. ఆమె తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అయినా పోలీసులు లెక్కచేయకుండా అరెస్టు చేశారు. ఈ విషయం కాస్త అందరికీ తెలియడంతో చివరకు ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంఘటన న్యూజిలాండ్​లో జరిగింది.

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ ఆదివారం రోజున రాత్రి సమయంలో మద్యం తాగి కారును అతివేగంగా నడిపారు. ఓ పార్కింగ్‌లోని వాహనాలను ఆమె కారు ఢీకొంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరీక్షించగా ఆమె మద్యం తాగినట్లు తేలింది. దీనికి తోడు ఆమె అరెస్టుకు సహకరించలేదు. చివరికి ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి నాలుగు గంటలపాటు ఉంచారు. తాజాగా ఆమె కోర్టులో కేసును ఎదుర్కోవాల్సి ఉంది. ఈ కారణంగా ఆమె సోమవారం పదవికి రాజీనామా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version