ఎడిట్ నోట్: శ్రావణ మాసం ‘లిస్ట్’..!

-

ఆగష్టు నెల..శ్రావణ మాసం..ఇదే బీఆర్ఎస్ పార్టీకి కీలక నెల. రాజకీయ వ్యూహాలు పన్ని ప్రత్యర్ధులకు చెక్ పెట్టే కే‌సి‌ఆర్..ముహూర్తాలని సైతం చూసుకుని రాజకీయం చేస్తారు.  అందుకే ఆగష్టు నెల శ్రావణ మాసంలో ఎమ్మెల్యే అభ్యర్ధుల ఫస్ట్ లిస్టుని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో ఎన్నికల్ షెడ్యూల్ రానుంది. ఇక షెడ్యూల రాక ముందే అభ్యర్ధులని ప్రకటించాలని కే‌సి‌ఆర్ డిసైడ్ అయ్యారు. ఈ మేరకు అభ్యర్ధుల లిస్టుని రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేసి..బలంగా ఉన్న అభ్యర్ధులని ప్రకటించనున్నారు. ఇక ప్రజా వ్యతిరేకత, స్థానికంగా నేతలతో, కార్యకర్తలతో సఖ్యత లేని ఎమ్మెల్యేలని అభ్యర్ధులుగా ప్రకటించే విషయంలో కే‌సి‌ఆర్  కాస్త ఆచి తూచి అడుగులేయనున్నారు. ఎలాగో బి‌ఆర్‌ఎస్‌కు 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణించారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఉపఎన్నిక నిర్వహించలేదు. అటు మిగిలిన పార్టీలు ఉన్న స్థానాలు 15.

brs party

ఇక వీటితో పాటు కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలని ప్రకటిస్తారని తెలిసింది.  అలాగే బి‌ఆర్‌ఎస్ లో జంపింగ్ ఎమ్మెల్యేలకు దాదాపు సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ నుంచి 12, టి‌డి‌పి నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరు బి‌ఆర్‌ఎస్ లోకి వచ్చారు. వీరికి దాదాపు సీట్లు ఖాయమని తెలుస్తుంది. అయితే బి‌ఆర్‌ఎస్ లో గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న వారిలో కొందరికి సీట్లు డౌట్ అని తెలుస్తుంది. వారిపైనే వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

అలాగే అలా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలని పక్కన పెడితే..ఆయా స్థానాల్లో బలంగా ఉన్న కాంగ్రెస్ నేతలని బి‌ఆర్‌ఎస్ లోకి తీసుకొచ్చి సీటు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఏదేమైనా గాని మొదటి లిస్టుని ఆగష్టులో ప్రకటించనున్నారు. ఇక అప్పుడు ఎవరికి సీటు వస్తుందో క్లారిటీ వస్తుంది. ఇక సీటు రాని వారు వేరే ఆప్షన్ చూసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ లోకి జంప్ అయిన విషయం తెలిసిందే. మరికొందరు అదే దిశగా వెళుతున్నారు. మొత్తానికైతే మొదట లిస్ట్ కోసం బి‌ఆర్‌ఎస్ నేతలు ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version