అమెరికా, దక్షిణ కొరియాలపై నిఘాయే లక్ష్యంగా ఉత్తర కొరియా గత కొద్దిరోజులుగా గూఢాచార ఉపగ్రహ ప్రయోగం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఓసారి ఈస్పై శాటిలైట్‌ను ప్రయోగించిన కిమ్ .. మొదటి ప్రయత్నంలో విఫలమయ్యాడు. ఇక తాజాగా ఇవాళ మరోసారి ప్రయోగించిన రెండో స్పై శాటిలైట్ (గూఢచార ఉపగ్రహం) కూడా విఫలమైందని ఉత్తర కొరియా తెలిపింది. మూడు దశల రాకెట్లో తలెత్తిన లోపం కారణంగా ఈ ప్రయోగం ఫెయిల్ అయినట్లు వెల్లడించింది.
ఈ ప్రయోగంలో జరిగిన వైఫల్యాలను అధ్యయనం చేసిన తర్వాత.. అక్టోబర్‌లో మూడోసారి ప్రయత్నించనున్నట్లు ఉత్తర కొరియా నేషనల్ ఏరోస్పేస్ డెవలప్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. స్పై శాటిలైట్ ‘మల్లిగ్యోంగ్-1’ను కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు కొత్త తరహా రాకెట్ ‘చోల్లిమా-1’ను ఉపయోగించినట్లు ఉత్తర కొరియా అంతరిక్ష సంస్థ వెల్లడించింది. రాకెట్.. మొదటి రెండు దశలు సాధారణంగానే సాగినా.. మూడో దశ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ సిస్టమ్‌లో లోపం కారణంగా ప్రయోగం చివరికి విఫలమైందని వివరించింది.