ఏంటీ.. చంద్రయాన్‌-3 బడ్జెట్‌ ‘ఆదిపురుష్‌’ కంటే తక్కువా..?

-

ప్రపంచంలోనే.. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైంది. చంద్రయాన్​-3లోని విక్రమ్ ల్యాండర్ సక్సెస్​ఫుల్​గా జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. అయితే ఇస్రో.. కేవలం రూ.615 కోట్ల బడ్జెటుతో ‘చంద్రయాన్‌-3’ అనే అద్భుతమైన కలను సాకారం చేసి చూపించింది. హాలీవుడ్‌ చిత్రాల నిర్మాణవ్యయం కంటే ఇది తక్కువనే చెప్పాలి.

ఇటీవల భారీస్థాయిలో విడుదలైన భారతీయ చిత్రం ‘ఆదిపురుష్‌’ బడ్జెటు రూ.700 కోట్లుగా మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ‘ఆదిపురుష్‌’ కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో శాస్త్రవేత్తలు కొత్త చరిత్ర లిఖించి.. భారతీయ పతాకను వినువీధుల్లో సగర్వంగా ఎగురవేశారని చెప్పవచ్చు. తాజాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న హాలీవుడ్‌ చిత్రాలు ‘బార్బీ’ (145 మిలియన్‌ డాలర్లు/రూ.1,197 కోట్లు), ‘ఓపెన్‌హైమర్‌’ (100 మిలియన్‌ డాలర్లు/రూ.825 కోట్లు)ల బడ్జెటు సైతం చంద్రయాన్‌-3 కంటే ఎక్కువే.

Read more RELATED
Recommended to you

Exit mobile version