ఆటలో పోటీ పడడానికి వెళ్లే ముందు సెక్స్ చేయడం చాలా మంచిదని దీని వల్ల మంచి పవర్ వస్తుందని ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ అల్లా శిష్కినా ( Alla Shishkina ) అన్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020 స్విమ్మింగ్ లోఈమె గోల్డ్ మెడల్ పొందారు. అయితే ఆమె ఆట లో పోటీ పడడానికి వెళ్లేటప్పుడు సెక్స్ చేయడం వల్ల మంచి ఎనర్జీ వస్తుందని తెలిపారు.
అదే విధంగా ఈమె టీమ్ డాక్టర్ ని కన్సల్ట్ చేసానని.. సెక్స్ కి మరియు ఆట తీరుకి ఎలాంటి సంబంధం ఉంటుంది అనేది కూడా తెలుసుకున్నాను అని రష్యన్ ఔట్లెట్ స్పోర్ట్ ఎక్స్ ప్రెస్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈమె చెప్పారు. అయితే నేను డాక్టర్ల తో మాట్లాడాను.
సెక్స్ వల్ల మంచి పర్ఫామెన్స్ ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే పవర్, స్టామినా కూడా పెరుగుతుంది అని ఆమె అన్నారు. టెస్టోస్టిరాన్ కూడా పెరుగుతుందని దీని కారణంగా మహిళల్లో మజిల్ మాస్ కూడా ఉంటుందని అన్నారు. టెస్టోస్టెరోన్ స్పోర్ట్స్ యాంగర్ మరియు కోపాన్ని పెంచుతుంది అని కూడా ఈమె తెలిపారు. ఇది ఇలా ఉంటే టీం ఇండియా మెంటల్ హెల్త్ కోచ్ paddy Upton కూడా ఇలాంటి విషయం గతంలో చెప్పారు. కానీ అతను చెప్పిన మాటలు టీమిండియా కోచ్ కి నచ్చలేదు దీంతో అతను క్షమించమని కోరాడు.