పాకిస్థాన్ లో హంగ్.. నవాజ్‌ కోసం రంగంలోకి సైన్యం.. ఇంకా తేలని ఫలితం

-

పాకిస్థాన్‌ పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సంకీర్ణ ప్రభుత్వానికే ఆ దేశ సైన్యం మద్దతు తెలిపినట్లు సమాచారం. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌- నవాజ్‌ (పీఎంఎల్‌- ఎన్‌) అధినేత, మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌కు అనుకూలంగా ఏకంగా సైన్యాధ్యక్షుడే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ ఆసీమ్‌ మునీర్‌ పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అనుకూలంగా మునీర్ వ్యవహరిస్తున్నట్టు వస్తున్న వార్తలకు ఆయన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి.

అవినీతి ఆరోపణలతో శిక్షపడి బెయిల్‌పై లండన్ పారిపోయిన షరీఫ్, ఎన్నికల ముందు పాక్‌కు రావడం వెనక సైన్యం హస్తం ఉందని ఆరోపణలున్నాయి. ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి పీఎంఎల్‌-ఎన్‌ సిద్ధంగా ఉందని ప్రకటించారు. మరోవైపు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీతో నవాజ్‌ షరీఫ్ సోదరుడు, షెహబాజ్ షరీఫ్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా బిలావల్‌ భుట్టో నేతృత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌(పీఎంఎల్​ఎన్)​ పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను బిలావల్‌ భుట్టో ఖండించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version