అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లు

-

ఈ ఏడాది బడ్జెట్ లో తెలంగాణ విద్యాశాఖకు కేటాయింపులు పెరిగాయి. 2023-24లో రూ.19,093 కోట్ల నిధులను గత ప్రభుత్వం కేటాయించగా.. ఈ ఏడాది అవి రూ.21,389 కోట్లకు పెరిగాయి. ఇందులో పాఠశాల విద్యకు 17,931.42 కోట్లు, ఉన్నత విద్యకు 2,959.10 కోట్లు, సాంకేతిక విద్యకు 487.64 కోట్లను ప్రభుత్వం కేటాయించింది.

మరోవైపు పైలట్‌ ప్రాజెక్టు కింద 2024-25 విద్యా సంవత్సరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్‌ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.500 కోట్లను వెచ్చిస్తామని తెలిపింది. మండలానికో పాఠశాల చొప్పున ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఉస్మానియా సహా అన్ని విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలకోసం మరో రూ.500 కోట్లను కేటాయించింది. మరోవైపు నైపుణ్య విశ్వవిద్యాలయా(స్కిల్‌ యూనివర్సిటీ)లను ఏర్పాటు చేసి, రాష్ట్ర అధికారుల అధ్యయన బృందం సూచించిన అత్యున్నత విధానాలను ఆ వర్సిటీల్లో అమలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version