తగ్గనున్న నూనెల ధరలు…పామ్ ఆయిల్ పై ఎగుమతుల నిషేధాన్ని ఎత్తేసిన ఇండోనేషియా

-

ఇండియాకు గుడ్ న్యూస్ రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు పామ్ ఆయిల్ పై ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో ఏ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎప్రిల్ 28న ఇండోనేషియాలో పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధాన్ని విధించింది అక్కడి ప్రభుత్వం. అయితే ఈ నెల 24 నుంచి నిషేధాన్ని ఎత్తేయనుంది. దేశంలో 17 మిలియన్ల కార్మికులు పామ్ ఆయిల్ పై ఆధారపడి బతుకుతున్నారు. వీరందరి సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఎగుమతిదారుగా ఉంది. తను ఉత్పత్తి చేసే మొత్తం పామాయిల్ లో కేవలం 35 శాతం మాత్రమే ఇండోనేషియా వినియోగించుకుంటోంది. మిగతాది ప్రపంచానికి ఎగుమతి చేస్తోంది. పామాయిల్ పై ఇండియా ఎక్కువగా ఇండోనేషియాపైనే ఆధారపడుతోంది. దాదాపు 70 శాతం ఇండోనేషియా నుంచే ఇండియాకు దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశంలో ఆయిల్ ధరలు దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version