వడగండ్ల వానతో విమానానికి రంధ్రం.. వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్

-

ఈ మధ్య తరచూ విమానా ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ వడగండ్ల వానతో ఓ విమానానికి ఏకంగా రంధ్రం పడింది. ఈ క్రమంలో వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన ఇటలీ రాజధాని రోమ్​లో చోటుచేసుకుంది. మిలాన్ నుంచి న్యూయార్క్ జేఎఫ్ కే ఎయిర్ పోర్టుకు బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రోమ్లో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

డెల్టా ఎయిర్ లైన్స్​కు చెందిన 185 నంబర్ విమానం 215 మంది ప్రయాణికులతో మిలాన్ నుంచి బయల్దేరింది. విమానం గాల్లోకి ఎగిరిన సమయంలో అనుకూలంగానే ఉన్న వాతావరణం.. ఒక్కసారిగా ప్రతికూలంగా మారిపోయింది. విమానం గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల్లోనే వడగండ్లు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురవడం షురూ అయింది. వడగండ్లు విమానంపై పడటంతో ధ్వంసమై రంధ్రం ఏర్పడింది. అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని రోమ్​లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానానికి రంధ్రం పడిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news