వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌ మృతి.. విమానం కూలిన దృశ్యాలు నెట్టింట వైరల్

-

వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ ప్రయాణించిన ఎంబ్రేర్‌ లీగసీ 600 ఎగ్జిక్యూటివ్‌ జెట్ కుప్పకూలిన విషయం తెలిసిందే. అయితే, ప్రమాదానికి 30 సెకన్ల ముందు వరకూ ఈ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం తెలుస్తోంది. చివరి క్షణాల్లో ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం. పొగలు వెలువరిస్తూ విమానం వేగంగా కిందకు వచ్చి కూలిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

విమానం 28వేల అడుగుల ఎత్తులో ఉండగా.. ఒక్కసారిగా అక్కడి నుంచి ఎత్తు క్షణానికోసారి వేగంగా మారిపోయిందని ఈ డేటా తెలిపింది. ఒక దశలో 30వేల అడుగుల ఎత్తుకు వెళ్లిందని.. కేవలం 30 సెకన్లలోనే విమానం 28వేల అడుగుల ఎత్తు నుంచి 8వేల అడుగులకు పడిపోయిందని వెల్లడించింది. ఆ తర్వాత కొద్ది సెకన్లకే విమానం కుప్పకూలిందని పేర్కొంది.

ఈ ప్రమాదం క్షణాల్లో జరిగిపోయిందని ఫ్లైట్‌ రాడార్‌ 24 ప్రతినిధి పెట్‌చెనిక్‌ చెప్పారు. విమానం ఉన్నట్టుండి నిలువుగా కిందకు వచ్చిందని.. 30 సెకన్ల ముందు వరకు కూడా ఈ విమానంలో సమస్య ఉన్నట్లు ఎలాంటి సంకేతాలు రాలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version