పాకిస్టాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇటీవల పాకిస్థాన్ లోని ప్రతిపక్ష పార్టీలు.. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు. ఈ అవిశ్వస తీర్మానానికి ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇమ్రాన్ ఖాన్.. మిత్ర పక్ష పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్.. తన ప్రధాన మంత్రి పదవి కోల్పోవడం ఖాయం అని తెలుస్తుంది.
అయితే పాక్ నేషనల్ అసెంబ్లీలో అవిశ్వాస తిర్మానంపై చర్చ జరగడం లేదు. పాక్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్.. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగడానికి అనుమతి ఇవ్వడం లేదు. తాజా గా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు.. అవిశ్వాస తీర్మానంపై చర్చలు జరగాలని పట్టుబట్టాయి. దీంతో సభలో కొద్ది పాటి గందరగోళం నెలకొంది. దీంతో సభను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేస్తు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. కాగ అవిశ్వాస తీర్మానంపై బుజ్జగింపులు చేసుకోవడానికి ఇమ్రాన్ ఖాన్ కు సమయం దొరికిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.