ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అలానే అనుకున్న దారిలో వెళితే విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ నిజానికి మన జీవితంలో సంతోషం ఉండాలంటే ఈ నాలుగు వాటికి దూరంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పారు.
వీటిని కనుక వదిలేస్తే జీవితంలో శాంతి పొందొచ్చు. అలానే ఆనందంగా ఉండటానికి కూడా అవుతుంది. అయితే మరి జీవితంలో దూరంగా ఉండాల్సిన నాలుగు వాటి గురించి చూద్దాం. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూసేయండి.
కోపం:
నిజానికి కోపం అనేది అతి పెద్ద శత్రువు. మనిషికి కోపం వుంటే గౌరవం లభించదు. అలానే కోపం ఉండడం వల్ల ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది ఎందుకంటే ఇతరులు ఎవరూ దగ్గరికి రారు. కాబట్టి కోపం వుందంటే అనవసరంగా ఒంటరిగా ఉంటూ బాధపడాలి.
బాహ్యాడంబరం:
ఎప్పుడూ కూడా బిజీగా ఉండే వాళ్ళ జీవితంలో ఆనందం ఉండదు. అలాంటి వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు చెప్పడం తప్పుడు పనులు చేయడం లాంటివి చేస్తారు. దీని వల్ల ఆనందం ఉండదు కదా..?
బద్ధకం:
మనిషికి కనుక బద్ధకం ఉంటే ఏ పని చేయలేరు బద్ధకానికి దూరంగా లేరు అంటే ఏమి సాధించలేరు. మంచి అవకాశాన్ని కూడా కోల్పోతారు లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు. అలానే బద్ధకం ఉంటే ఆనందం కూడా కలగదు.
అహంకారం:
అహంకారం ఉండడం వల్ల మనుషులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. జీవితంలో అహంకారం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి అహంకారం నిజానికి అన్నిటినీ నాశనం చేస్తుంది .ఆనందం కూడా దూరం అవుతుంది. ఇలా వీటి వల్ల మనిషి జీవితంలో ఆనందం పొందలేరు కాబట్టి ఏయే లక్షణాలని వదులుకుంటే మంచిది.