ప్రిగోజిన్‌ శరీరంలో గ్రనేడ్‌ శకలాలు.. తొలిసారి వాగ్నర్ బాస్​ మృతిపై స్పందించిన పుతిన్‌..!

-

రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ ఇటీవలే ఓ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆయన మరణం వెనక ఉంది రష్యా అధ్యక్షుడు పుతిన్ అని ప్రపంచమంతా భావిస్తోంది. దీనిపై పుతిన్ ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. కానీ జీవితంలో చాలా తప్పులు చేసినా.. లక్ష్యాలను సాధించిన వ్యక్తిగా ప్రిగోజిన్​ను పుతిన్ అభివర్ణించినట్టు కథనాలు వెలువడ్డాయి.

అయితే ప్రిగోజిన్ మరణం తర్వాత మొదటిసారిగా ఆయన మృతిపై పుతిన్ బహిరంగంగా స్పందించారు. విమాన ప్రమాద అనంతరం ప్రిగోజిన్‌ సహా అందులో ప్రయాణిస్తున్న వారి శరీరాల్లో గ్రనేడ్‌ శకలాలు లభించాయని ఆయన తెలిపారు. పుతిన్‌ తన వార్షిక సమావేశం సందర్భంగా విలేకర్లకు ఈ విషయాన్ని వెల్లడించారు.

విమానం బయట నుంచి దాడి జరగలేదని వెల్లడించారు. ఈ విషయాన్ని తనకు దర్యాప్తు కమిటీ అధిపతి కొన్నాళ్ల క్రితం వాలిదాయ్‌ డిస్కషన్‌ క్లబ్‌లో వెల్లడించారని పుతిన్ వివరించారు. ప్రిగోజిన్ సహా మిగిలిన వారి శరీరాల్లో గ్రనేడ్‌ శకలాలు కనిపించాయని.. కుట్ర కోణం సహా అన్ని రకాలుగా దర్యాప్తు నిర్వహిస్తున్నామని పుతిన్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version