డిసెంబర్ 10-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు?

-

డిసెంబర్ 10-15 మధ్య తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది.  5 రాష్ట్రాల ఎన్నికల పరిశీలకులతో ఢిల్లీలో శుక్రవారం ఈసీ భేటీ అయ్యింది. ఒకే విడతలో తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గడ్ లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

వచ్చే మూడు రోజుల్లో ఏ క్షణమైనా ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుందని సమాచారం. డిసెంబర్ 10-15 మధ్య ఓట్ల కౌంటింగ్ జరగనుందని తెలుస్తోంది. ఇక ఈ తరుణంలోనే.. తెలంగాణలో ఎలాగైనా కర్ణాటక ఫలితాలు రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కార్యాచరణను సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. ఇప్పుడు ఈ గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో పడింది. ఇందుకోసం 119 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. దీని ద్వారా ఇప్పటివరకు ప్రకటించిన యువ డెక్లరేషన్, వ్యవసాయ డిక్లరేషన్, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, చేయూత పెన్షన్ పథకం, 6 హామీల గ్యారెంటీ కార్డు జనంలోకి తీసుకెళ్లనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version