ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన రోహిత్ శర్మ.. కోహ్లీని వెనక్కి నెట్టి మరీ..!

-

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సత్తా చాటాడు. తాజాగా ఐసీసీ ప్రకటించిన బ్యాటర్ల ర్యాంకింగ్ లో రోహిత్ శర్మ 6వ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023లో అదరగొడుతున్న రోహిత్.. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 6వ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అప్గానిస్తాన్ పై సెంచరీతో చెలరేగిన హిట్ మ్యాన్.. పాకిస్తాన్ పై కూడా 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ నేపథ్యంలోనే రోహిత్ తన ర్యాంక్ ను మెరుగుపరుచుకున్నాడు. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని తొలిసారి రోహిత్ అధిగమించాడు. కోహ్లీ ప్రస్తుతం 9వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. నెంబర్ వన్ ర్యాంకులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం ఉండగా.. రెండో స్థానంలో టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ నిలిచాడు. అలాగే ఈ మెగా టోర్నీలో రెండు వరుస సెంచరీలతో చెలరేగిన దక్షిణాఫ్రికా స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్.. వన్డే ర్యాంకింగ్స్ లో మూడు స్థానాల్లో ఎగబాకి మూడో స్థానానికి చేరుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version