ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో… పాకిస్తాన్ దొంగ దెబ్బ తీస్తుంటే… ఇండియా నేరుగా… పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై దాడులు చేస్తోంది. అటు పాకిస్తాన్ ఎయిర్ బేస్ లను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ. ఓవరాల్ గా మొన్న జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై ఇండియా గెలిచిందని చెప్పవచ్చు.

పాకిస్తాన్ ప్రయోగించిన టర్కీ, అలాగే చైనా డ్రోన్లు ఏమాత్రం పని చేయలేదు. వీటి ఆట కట్టించారు ఇండియన్ ఆర్మీ సభ్యులు. ముఖ్యంగా రష్యా నుంచి తీసుకువచ్చిన S – 400 దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడింది. ఇండియా విజయంలో ఈ క్షిపణి వ్యవస్థ బాగా.. ఉపయోగపడింది. అయితే ఈ S – 400… కేవలం 400 కిలోమీటర్ల రేంజ్ వరకు మాత్రమే.. పనిచేస్తుంది. ఆ కిలోమీటర్ల లోపు శత్రువులు ఎవరున్నా నాశనం చేస్తుంది.
S – 500 మిస్సైల్ సిస్టం వస్తోంది
S – 400 మిస్సైల్ నే తట్టుకొని పాకిస్తాన్…S – 500 మిస్సైల్ వస్తే భూస్థాపితం కావడం… గ్యారంటీ. అయితే… ఈ మిస్సైల్ ను ఇండియా ఇంకా కొనుగోలు చేయలేదు. వీటి పరిధి 600 కిలోమీటర్లు. 600 కిలోమీటర్ల దూరంలో శత్రువులు ఎవరున్నారు ధ్వంసం చేస్తుంది S – 500 మిస్సైల్. అలాంటి మిస్సైల్ తయారీకి రష్యా ముందుకు వచ్చింది. అంతేకాదు ఇండియాతో ఈ S – 500 మిస్సైల్ ను ఉమ్మడిగా తయారు చేసేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇది గ్రాండ్ సక్సెస్ అయితే… తిరుగులేని శక్తిగా ఇండియా నిల్వబోతోంది.
🚨 BREAKING NEWS
Russia proposes joint production of S-500 air defense system to India again. pic.twitter.com/vWtsMHYwzq
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 12, 2025