భద్రతామండలిలో స్థానానికి భారత్‌కు రష్యా మద్దతు

-

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్లపై రష్యా మరోసారి స్పందించింది. ఈ సందర్భంగా భారత్‌కు మద్దతు పలికిన రష్యా శాశ్వత సభ్యత్వం డిమాండ్‌పై సానుకూలత వ్యక్తం చేసింది. యూఎన్‌ఎస్‌సీలో స్థానం పొందేందుకు న్యూదిల్లీకి అన్ని అర్హతలూ ఉన్నాయని రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్‌ అన్నారు. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.

ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడం పేద దేశాల (గ్లోబల్‌ సౌత్‌) అభివృద్ధికి తోడ్పడుతుందని అలిపోవ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అత్యధిక మంది ప్రజలకు దానిలో ప్రాతినిధ్యాన్ని పెంచే సామర్థ్యం భారత్‌కు ఉందని రష్యా బలంగా నమ్ముతోందని తెలిపారు. న్యూదిల్లీకి ప్రస్తుతం శాశ్వత సభ్యత్వం లేదన్న అలిపోవ్.. గతంలో తాత్కాలిక సభ్యత్వంతో భద్రతా మండలికి రెండు సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని గుర్తు చేశారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని,  జీ20 సభ్య దేశాలను ‘దిల్లీ డిక్లరేషన్‌’ వేళ ఏకతాటిపై నడిపించడమే దాని సమర్థతకు నిదర్శమని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version