నిబంధనల ప్రకారం నాటో సభ్య దేశాలు రక్షణ బడ్జెట్లను పెంచుకోకపోతే తానే వాటిపైకి రష్యాను ఉసిగొల్పుతానని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వ బరిలో ఉన్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. దక్షిణ కరోలినా ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ట్రంప్.. తన హయాంలో జరిగిన నాటో సమావేశం సందర్భంగా తాను సభ్య దేశాధినేతలకు ఈ విషయాన్ని తేల్చి చెప్పినట్లు వెల్లడించారు.
గతంలో జరిగిన నాటో సమావేశంలో ఓ దేశాధినేత మాట్లాడుతూ.. కూటమి నిబంధనల మేరకు రక్షణపై ఖర్చు చేయకపోతే.. తమపై రష్యా దాడి చేస్తే అమెరికా కాపాడదా? అని ప్రశ్నించారని ట్రంప్ చెప్పారు. అయితే అమెరికా వారిని రక్షించదని తాను నిర్మొహమాటంగా చెప్పానని, మాస్కో ఏం కావాలనుకుంటే అది చేయాలని ప్రోత్సహిస్తానని వారితో అన్నట్లు ట్రంప్ ఈ ర్యాలీలో మాట్లాడుతూ చెప్పారు.
ట్రంప్ వ్యాఖ్యలపై వైట్ హౌజ్ ప్ర తినిధి ఆం డ్రూ బెట్స్ స్పందిస్తూ.. ‘‘హంతక పాలకులన మా మిత్రదేశాలపై ఉసిగొల్పుతాననడం భయంకరమైన విషయం. ఇలాంటివి అమెరికా, ప్రపంచ శాంతి భద్రతలను ప్రమాదంలో పడేస్తాయి’ అన్నారు.