రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలతో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి ఆ దేశాన్ని విడిచిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఆమె కుమార్తె సైమా వాజెద్ తాజాగా స్పందించారు. ఈ కష్టకాలంలో అమ్మకు తోడుగా ఉండలేకపోతున్నందుకు బాధగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. తాజాగా ఆమె ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.
‘‘నేను ప్రేమించే నా దేశమైన బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు, వాటి వల్ల జరిగిన ప్రాణనష్టం చూసి నా గుండె పగిలింది. ఈ కష్టకాలంలో నా తల్లి చూడలేకపోతున్నాను. ఆమె కౌగిలించుకోలేకుని ఓదార్చలేకపోతున్నాననే బాధ నా గుండెను పిండేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో రీజినల్ డైరెక్టర్‌గా నా విధి నిర్వహణకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది. కానీ ఓ కూతురిగా నా బాధ్యత నిర్వర్తించలేకపోతున్నాను.’’ అని సైమా వాజెద్ తన పోస్టులో రాసుకొచ్చారు. ఆమె ఈ ఏడాది ఆరంభంలో డబ్ల్యూహెచ్‌ఓకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉంటున్నారు. హసీనాకు ఇద్దరు సంతానం. కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ అమెరికాలో ఉంటున్నారు.