మరోసారి క్షిపణి పరీక్షలు.. ఉత్తరకొరియా వార్నింగి ఇచ్చిన సౌత్ కొరియా

-

పొరుగు దేశాలను భయపెట్టడమే పనిగా పెట్టుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. మరోసారి క్షిపణి ప్రయోగాలు చేసి తోటి దేశాలను వణికించారు. ఒకేసారి అనేక క్షిపణులు ప్రయోగించారు. చైనా, కొరియాద్వీపకల్పం మధ్య ఉన్న ‘ఎల్లోసీ’లో క్షిపణి ప్రయోగం చేశారు.

బుధవారం బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా.. తాజాగా మరోసారి పలు క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది. ఇవాళ తెల్లవారుజామున కొరియా ద్వీపకల్పానికి పశ్చిమాన ఉన్న సముద్రం వైపు ఉత్తర కొరియా పలు క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌ యోన్‌హాప్ తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రయోగాలు జరిగినట్లు చెప్పారు. దీంతో కొరియా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

క్షిపణుల ప్రయోగంతో ఉత్తరకొరియాకు దక్షిణ కొరియా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమదేశంపై అణుదాడి జరిగితే కిమ్‌ పాలనకు అదే ముగింపని హెచ్చరించింది. కొరియా ద్వీపకల్పంలో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కిమ్ వరుస క్షిపణి ప్రయోగాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version