1.5కోట్లకి అంతరిక్షంలో విహారం.. అమెజాన్ కొత్త ప్లాన్.

-

2050వరకల్లా అంగారక గ్రహంపైకి మనుషుల ప్రయాణం చాలా సులువవుతుందని, ఇతర దేశాలకి వెళ్తున్నట్టుగా అంగారక గ్రహం మీదకి రాకపోకలు సాగుతాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. తాజాగా అమెజాన్ కి చెందిన కొత్త కంపెనీ బ్లూ ఆరిజన్ స్పేస్ ట్రావెల్ కి రంగం సిద్ధం చేస్తుంది. స్పేస్ ట్రావెల్ అనగానే ఆస్ట్రోనాట్స్ వెళ్తారనుకుంటే పొరపాటే. సామాన్య మానవులని స్పేస్ కి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యింది. ఇక్కడ సామాన్య మానవులంటే కేవలం డబ్బున్నవారే అని అర్థం.

అవును, కొన్ని నిమిషాల అంతరిక్ష ప్రయాణానికి సుమారుగా 1.5కోట్లువసూలు చేస్తుంది. ఐతే దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. కొంచెం అటూ ఇటూగా 1.5కోట్ల వరకి ఉంటుందని తెలుస్తుంది. ఈ స్పేస్ షిప్ లో ఆరుగురు ప్రయాణికుల వరకు వెళ్ళవచ్చట. ప్రస్తుతం బ్లూ ఆరిజన్ పై అమెజాన్ సీఈవో పెట్టుబడులు పెడుతున్నారట. మరికొద్ది రోజుల్లో అమెజాన్ సీఈవోగా దిగిపోయి పూర్తి సమయం బ్లూ ఆరిజన్ పై ఉంచుతాడట.

Read more RELATED
Recommended to you

Exit mobile version