మాలిలో భారతీయుల కిడ్నాప్ ఘటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పశ్చిమాఫ్రికా దేశం మాలిలో ముగ్గురు భారతీయులను అపహరించారు. కేయెస్ ప్రాంతంలోని సిమెంట్ ఫ్యాక్టరీపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

మరో ఇద్దరు ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తమ గోడును చెప్పుకున్నారు తెలుగు వ్యక్తి కుటుంబ సభ్యులు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖకు లేఖ రాశారు కిషన్ రెడ్డి. కిడ్నాప్ జరిగి ఐదు రోజులు గడుస్తున్నా ఎలాంటి డిమాండ్లు చెప్పలేదు ఉగ్రవాదులు. ఇక ఈ సంఘటన ఇప్పుడు హాట్ టపాక్ అయింది.