పోప్ ఫ్రాన్సిస్ చివరి వీడియో వైరల్ గా మారింది. పోప్ ఫ్రాన్సిస్ సోమవారం ఉదయం మరణించారు. వాటికన్‌లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. వాటికన్ కామెరెంగో కార్డినల్ కెవిన్ ఫెర్రెల్ ఈ విషయాన్ని ప్రకటించారు. పోప్ తన జీవితమంతా చర్చి సేవకు అంకిత మయ్యారని ఆయన తెలిపారు.

ఇటీవల అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఈస్టర్ సందర్భంగా ఆదివారం రోజున సందేశం కూడా ఇచ్చారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు. ఈ తరుణంలో పోప్ ఫ్రాన్సిస్ చివరి వీడియో వైరల్ గా మారింది.
- ఈస్టర్ మరుసటి రోజే పోప్ కన్నుమూత
- నిన్న ఈస్టర్ సందర్భంగా పోప్ సందేశం
- పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోర్లియో
- 1936 డిసెంబర్ 17న అర్జెంటీయాలోని బ్యూనస్ లో జన్మించిన పోప్
- 2013 మర్చి 13న 266వ పోప్ గా ఎన్నికైన ఫ్రాన్సిస్
- అమెరికా నుంచి పోప్ గా ఎన్నికైన మొదటి వ్యక్తి ఫ్రాన్సిస్
- వలసదారులు, శరణార్థుల పట్ల ఫ్రాన్సిస్ సానుకూల వైఖరి
పోప్ ఫ్రాన్సిస్ చివరి వీడియో ఇదే..! https://t.co/Ubo6h51XJr pic.twitter.com/JpwCD25LuP
— BIG TV Breaking News (@bigtvtelugu) April 21, 2025