ప్రపంచ ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ పెను ప్రమాదం.. బైడెన్ ఘాటు విమర్శలు

-

దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి డొనాల్డ్‌ ట్రంప్‌ పెను ప్రమాదం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఘాటు విమర్శలు చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ముందు మోకరిల్లి పగ, ప్రతీకారాలకు ట్రంప్ మద్దతిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కాంగ్రెస్‌ ఉభయసభలను ఉద్దేశించి బైడెన్‌ తన చివరి ‘స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌’ ప్రసంగంలో ట్రంప్‌పై విరుచుకుపడ్డారు.

ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన బైడెన్ 2020 జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడిని ప్రస్తావించారు. ఆ రోజు ప్రజాస్వామ్యానికి తీవ్ర హాని కలిగించే ప్రయత్నం చేసిన వారితో ఇంకా అమెరికాకు ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించేందుకు సహకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. అమెరికా సైనికులను ఉక్రెయిన్‌ అడగడం లేదన్న బైడెన్.. ఆయుధాలను మాత్రమే కోరుతోందని తెలిపారు. పుతిన్‌ను నిలువరించాలంటే ఇది తప్పనిసరని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అమెరికా నాయకత్వం వద్దనుకుంటున్న వారు ఆ సాయాన్ని అడ్డుకుంటున్నారని జో బైడెన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version