శాసన సభ నుంచి ఎంఐఎం వాకౌట్

-

అసెంబ్లీని వాకౌట్ చేశారు ఎంఐఎం పార్టీలు ఎమ్మెల్యేలు. ఈ తరుణంలోనే.. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అసెంబ్లీ, గాంధీ భవన్ కాదంటూ చురకలు అంటించారు. అసెంబ్లీని అసెంబ్లీలా నడపండి.. గాంధీ భవన్ లా కాదు…. అసెంబ్లీ నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటూ వాకౌట్ చేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.

Akbaruddin Owaisi

ఈ తరుణంలోనే… అసెంబ్లీని వాకౌట్ చేశారు ఎంఐఎం ఎమ్మెల్యేలు. రంజాన్ మాసం కావడంతో తినకుండా,నీళ్ళు తగ్గకుండా ప్రిపేర్ అయ్యి సభకు వచ్చామని ఆగ్రహించారు. మా బాధ్యత మేము నిర్వహించాలని సభకు వచ్చామన్నారు. మేము నిరసన తెలుపుతున్నామని చెప్‌పారు. సభను నడపడం లో ప్రభుత్వం ఫెయిల్ అవుతుందన్నారు. ఎజెండా టైం కి రాదు.. ప్రశ్నలు మార్చేస్తారని ఆగ్రహించారు. ఒకసారి రాత్రి 9 గంటలకి ఇస్తారు.. ఒక రోజు తెల్లవారుజామున ఇస్తారు ఇదేం పద్ధతి అధ్యక్షా అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version