రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ జవాబులిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు రూ.2500, తులం బంగారం ఎప్పటి నుంచి అమలు చేస్తారని కవిత అడిగిన ప్రశ్నలకు ఇప్పట్లో అమలు చేయలేమని మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. దీంతో మహిళలను మోసం చేశామని మంత్రి చాలా క్లియర్‌గా నిండు సభలో ప్రకటించారని కవిత ప్రకటించడం గమనార్హం.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
రూ.2500, తులం బంగారం హామీలకు మంగళం పాడిన కాంగ్రెస్ ప్రభుత్వం
శాసన మండలి సాక్షిగా మహిళలకు చెప్పిన రూ.2500, తులం బంగారం హామీలను అమలు చేయలేమని చెప్పేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/sq6g43GJG6
— Telugu Scribe (@TeluguScribe) March 17, 2025