ఓయూ బంద్‌కు ఏబీవీపీ పిలుపు.. విద్యార్థి నాయకుల ముందస్తు అరెస్టులు

-

ఓయూలో ఆందోళనలు, నిరసనలు చేపట్టరాదని రిజిస్ట్రార్ ఇచ్చిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఏబీవీపీ నేడు యూనివర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్థుల స్వేచ్ఛను కాలరాస్తూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఏబీవీపీ నాయకులు సోమవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలోనే విద్యార్థి నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.యూనివర్సిటీ హాస్టళ్లలోకి ప్రవేశించి బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ నాయకులను ముందస్తు అరెస్టులు చేశారు.అరెస్ట్ చేసిన ఏబీవీపీ స్టూడెంట్ లీడర్లను పోలీసులు వర్సిటీ నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఏబీవీపీ విద్యార్థి నాయకుడు మాట్లాడుతూ..అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. ఖబర్ధార్ వీసీ అంటూ విద్యార్థుల హక్కులకు వ్యతిరేకంగా జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version