టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ సంస్థలో కీలక మార్పులు చేశారు. మొదటగా ట్విటర్ హెడ్లను ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ తర్వాత వరుసగా పలువులు ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. అనంతరం డబ్బు చెల్లించిన వారికే బ్లూ టిక్ అంటూ కొత్త రూల్ పెట్టారు. దాంతో చాలా మంది ప్రముఖులు డబ్బు చెల్లించి బ్లూటిక్ సేవలు పొందుతున్నారు.
అయితే ఉన్నట్టుండి ఇటీవల కొందరు ప్రముఖుల ట్విటర్ ఖాతా నుంచి బ్లూ టిక్ మాయమైంది. వారు డబ్బు చెల్లించకపోవడం వల్లే తీసేశామని ట్విటర్ ప్రకటించింది. అయితే తాజాగా ట్విటర్ అకౌంట్‌లకు బ్లూ టిక్ కోల్పోయిన పలువురు ప్రముఖులకు మళ్లీ బ్లూ టిక్ వచ్చేసింది. 10 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్న వారు ఫీజు చెల్లించకపోయినా బ్లూ టిక్ ఇవ్వాలని ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్ నిర్ణయించారు.
ట్విటర్‌ను కొనుగోలు చేసిన మస్క్ బ్లూ టిక్ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించి సబ్‌స్ర్కైబ్ చేసుకోవాలని రూల్ పెట్టారు. ఈ సర్వీసు పొందని వారికి ఏప్రిల్ 20న బ్లూ టిక్‌లు తీసేశారు. ఇప్పుడు 10 లక్షల మంది ఫాలోయర్లు ఉన్న వారికి బ్లూ టిక్‌లు పునరుద్ధరించారు.