రష్యాపై ఉక్రెయిన్ ప్రతీకార చర్య కొనసాగుతోంది. గత కొంతకాలంగా రష్యాలోని కీలక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్లు డాడులు చేసి భారీ నష్టాలను కలిగిస్తున్నాయి. తాజగా రష్యాకు చెందిన సూపర్ సానిక్ విమానాలుండే షైకోవ్కా స్థావరంపై భారీగా బాంబింగ్ జరిగింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరంపై గత వారాంతంలో నోవ్‌గ్రోడ్‌లోని స్లాట్సీ మిలిటరీ ఎయిర్‌ఫీల్డ్ పై కూడా దాడి జరిగినట్లు రష్యా వర్గాలు వెల్లడిస్తున్నాయి.
తాము చేసిన దాడిలో కనీసం ఒక రష్యా లాంగ్‌రేంజి బాంబర్ విమానం ధ్వంసమైపోయిందని ఉక్రెయిన్ ప్రతినిధి ఆండ్రీ యూసోవ్ పేర్కొన్నారు. ఈ దాడిని అత్యంత సమన్వయంతో నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. రష్యా అంతర్గత భూభాగాల నుంచే వివిధ పనులను తాము చక్కబెడుతున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్ డ్రోన్ అక్కడ ఉదయం 8 గంటల సమయంలో ల్యాండ్ అయిందని పేర్కొన్నారు. సాధారణ పౌరులు ఉపయోగించే కాప్టర్‌కు ఐఈడీని అమర్చి బ్యాటరీ సాయంతో దానిని పేల్చినట్లు సమాచారం.