బందీలను తక్షణమే విడిచిపెట్టండి.. హమాస్‌కు UN చీఫ్‌ విజ్ఞప్తి

-

ఇజ్రాయెల్​పై భీకర దాడులు చేస్తున్న హమాస్‌ ఆ దేశంలోని పౌరులు, విదేశీయులు, మహిళలను బందీలుగా తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. హమాస్ మిలిటెంట్ల రాక్షస దాడులు.. మరణకాండపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఈ యుద్ధంపై ఆవేదన చెందుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఐరాస చీఫ్ ఆంటోనియా గుటెరస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్.. తమ ఆధీనంలోని బందీలను తక్షణమే బేషరతుగా విడిచిపెట్టాలని కోరారు. ఇజ్రాయెల్‌ కూడా గాజా వాసుల కోసం సాయాన్ని తరలించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో చోటుచేసుకుంటున్న నాటకీయ పరిణామాల మధ్య.. రెండు మానవీయత విజ్ఞప్తులు చేయాలనుకుంటున్నానని గుటెరస్ ఓ ప్రకటన జారీ చేశారు. హమాస్‌ బేషరుతుగా బందీలను విడుదల చేయాలని.. అదే సమయంలో ఇజ్రాయెల్‌ కూడా గాజాలోని ప్రజలు, కార్మికుల కోసం ఎటువంటి అవరోధాలు లేకుండా మానవతా సాయం చేరేట్లు చూడాలని అందులో కోరారు. ఈ రెండు చాలా ముఖ్యమైనవన్న గుటెరస్.. వీటిని బేరసారాల్లో ఆయుధాలుగా వాడకుండా ఉండటం సరైన పని అని పేర్కొన్నారు.

“గాజాలో నీరు, విద్యుత్తు, నిత్యావసరాల నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఐరాసకు చెందిన ఆహారం, నీరు, ఆహారేతర వస్తువులు, ఔషధాల నిల్వలు ఈజిప్ట్‌, జోర్డాన్‌, వెస్ట్‌బ్యాంక్‌, ఇజ్రాయెల్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని కొన్ని గంటల్లోనే గాజాలోకి తరలించవచ్చు. వీటిని గాజాలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఐరాస సిబ్బందికి, ఎన్‌జీవోలకు అందిస్తే.. వారు గాజా మొత్తానికి అందుబాటులోకి తీసుకువస్తారి. ఇందుకోసం సరఫరాలకు ఆటకం లేకుండా చూడటం కీలకం” అని గుటెరస్‌ తెలిపారు

Read more RELATED
Recommended to you

Exit mobile version