ఓటమి అనంతరం అనూహ్య నిర్ణయాలకు సిద్దమైన ట్రంప్..!

-

అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన అధ్యక్షుడు ట్రంప్ అనూహ్య నిర్ణయాలకు సిద్ధమైనట్లు విశ్వసనీయవర్గాలు చెపుతున్నాయి. ఇంతకీ ఏమిటవి.. ఏ దేశంపై ట్రంప్ కన్నుపడింది? తెలుసుకుందామా..!

trump

ట్రంప్ ఇరాన్‌ దేశంపై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాలపై గతవారం ఆరా తీసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇరాన్‌లోని ప్రధాన అణుస్థావరంపై దాడికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారుల్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, కొత్తగా నియమితులైన డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ మిల్లర్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను సదరు అధికారి ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది.

అయితే, ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని అధికారులు సమర్థించలేదని వినిపిస్తోంది. ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారనట్లు తెలిపారు. దీనిపై స్పందించడానికి శ్వేతసౌధం నిరాకరించింది. ట్రంప్‌ మొదటి నుంచి ఇరాన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు. అలాగే ఇరాన్‌ అత్యున్నత స్థాయి సైనిక కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై దాడి చేయించి మరణానికి కారణమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత భగ్గమన్నాయి.

అణుఒప్పందంలోని నిబంధనలను ఇటీవల ఇరాన్‌ మరోసారి అతిక్రమించినట్లు ఐరాస నివేదిక తెలిపింది. అణుశుద్ధిలో ప్రధాన పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌లను కీలక స్థానంలోకి మార్చే ప్రక్రియను ముగించిందని పేర్కొంది. ఈ నివేదిక బయటకు వచ్చిన మరుసటి రోజే ఇరాన్‌పై దాడికి గల ప్రత్యామ్నయాలను ట్రంప్ ఆరా తీసినట్లు ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రస్తుతం కరోనా వైరస్ కు సంబంధించి వ్యాక్సిన్ ను ప్రజలందరికీ పంపిణీ చేయటంలో ట్రంప్ సహకరించాలని నూతనంగా ఎన్నికైన బైడెన్ చెప్తుంటే అవేవి పట్టనట్లు ట్రంప్ పక్క దేశాలపై దాడికి సన్నాహాలు చేయటం విమర్శలకు దారితీస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version