అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెల్త్ బులెటిన్ విడుదల

-

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొవిడ్-19 బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బైడెన్ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది వైట్ హౌస్. కొవిడ్‌ కారణంగా తేలికపాటి శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తినట్లు బైడెన్ పర్సనల్ డాక్టర్ చెప్పాడని ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు జ్వరం లేదని తెలిపింది. అయితే బైడెన్ ప్రస్తుతం స్వల్ప దగ్గు, జలుబు, సాధారణ అనారోగ్యంతో బాధపడుతున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో వైట్ హౌస్ పేర్కొన్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం బైడెన్‌ డెలావేర్‌లో సముద్ర తీరంలో ఉన్న తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నారు. అక్కడే కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా లాస్‌ వెగాస్‌లో ప్రచారంలో ఉన్న బైడెన్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో ఆయన వెంటనే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు మీడియాకు వెల్లడించారు. వాస్తవానికి బుధవారం మధ్యాహ్నం లాస్ వెగాస్‌లో జరిగే యూనిడోస్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడాల్సి ఉంది. కానీ దీనివల్ల అది క్యాన్సిల్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version