BREAKING : పుతిన్​కు ఎదురుదెబ్బ.. రష్యా సైన్యంపై వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు

-

ఉక్రెయిన్​పై ఏడాదికి పైగా యుద్ధం చేస్తూ.. దురాక్రమణ చేస్తున్న రష్యాకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా చోటుచేసుకున్న ఓ అనూహ్య పరిణామం రష్యా అధ్యక్ష పీఠాన్ని పెకిలించే అవకాశముందని ప్రపంచం భావిస్తోంది. ఇంతకీ ఏమైందంటే..?

ఉక్రెయిన్​పై యుద్ధం చేస్తున్న రష్యాను ఓ పిడుగులాంటి వార్త ఆందోళన కలిగిస్తోంది. సైనికచర్యలో రష్యా బలగాలకు అండగా ఉన్న వాగ్నర్‌ గ్రూప్​ ఇప్పుడు తిరుగుబావుటా ఎగరేసింది. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేసింది. ఈ క్రమంలో తమ దారికి అడ్డుగా వచ్చే వారిని ఉపేక్షించమని స్పష్టం చేసింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.

ఉక్రెయిన్‌లో తమకు ఎదురవుతున్న సవాళ్లపై వాగ్నర్‌ సేన అధిపతి యెవ్‌గెనీ ప్రిగోజిన్‌ ప్రిగోజిన్‌ ఎప్పటికప్పుడు బహిరంగంగా తన అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నారు. ఆయన అక్కడి రక్షణ శాఖపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలో రష్యా సైనిక నాయకత్వాన్ని కూలదోస్తామని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆడియో క్లిప్‌ ఇప్పుడు ప్రభుత్వాన్ని తీవ్ర కలవరపాటులోకి నెట్టేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version